కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంత గజగజలాడించినా అన్ని దేశాలు ఎంతోకొంత ప్రయత్నం చేస్తూ.. కొంతవరకైనా కట్టడి చేస్తున్నాయి. అయితే ఒక దేశంలో మాత్రం కరోనా వైరస్ను నియంత్రించలేక ఏకంగా ప్రధానమంత్రే తన పదవికి రాజీనామా చేశారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే..
కరోనాని కట్టడి చేయలేక మంగోలియా ప్రధాని రాజినామా చేశారు. కరోనా స్టార్టింగ్ స్టేజ్ లో మంగోలియా కూడా బాగానే కట్టడి చర్యలు చేపట్టింది. అయితే ఆ దేశంలో ఇప్పుడు సెకండ్ వేవ్ మొదలైంది. దీంతో ఆ దేశంలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీనిపై ఆ దేశంలో జనం కోపంగా ఉన్నారు. అయితే ఈ కరోనా విషయంలో పరిస్థితిని కంట్రోల్ చేయలేక ప్రధానమంత్రి ఖురేసుఖ్ ఉఖ్నా తన పదవికి రాజీనామా చేశారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలతో పాటు నిరసనలు కూడా వచ్చాయి. ఈ నిరసనలకు తట్టుకోలేక వాటికి బాధ్యత వహిస్తూ ఖురేసుఖ్ ఉఖ్నా ప్రధాని పదవికి రాజీనామా చేశారు.