ఇండోనేషియాలో రక్తపు రంగులో వచ్చిన వరదకు జనాలు ఖంగు తిన్నారు. జనాలు భయపడి.. నెత్తుటి వర్షం.. యుగాంతం అంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎర్రటి నీరు పారుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అసలక్కడ ఏం జరిగిందంటే..
ఇండోనేషియా సెంట్రల్ జావాలోని పెకలోంగన్ గ్రామంలో భారీవర్షాలతో శనివారం వరదలు సంభవించాయి. దీంతో అక్కడుండే బాతిక్ అనే ఫ్యాక్టరీ కూడా వరదలో మునిగిపోయింది. బాతిక్ అనేది రంగుల ఫ్యాక్టరీ, బాతిక్ ఫ్యాబ్రిక్, బాతిక్ కలర్స్ అక్కడ చాలా ఫేమస్. అయితే ఈ ఫ్యాక్టరీలోని రంగులు వరద నీటిలో కలిసి పోయి, రక్తాన్ని పోలిన ముదురు ఎరుపు రంగు వరద నీళ్లు గ్రామాల చుట్టూ చేరాయి.
అసలు విషయం తెలియని జనాలు కంగారు పడిపోయారు. సోషల్ మీడియాలో ఏవేవో పోస్టులు పెడుతూ మిగతావారిని కూడా భయపెట్టారు. అప్పుడు వెంటనే పెకలొంగన్ అధికారులు స్పందించి అసలు విషయం చెప్పారు. ఆ ఎరుపు రంగు… ఫ్యాక్టరీ నుంచి వచ్చింది అని చెప్పిన తర్వాత స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
— Raja Purwa (@Raj4Purwa) February 6, 2021