29.3 C
Hyderabad
Monday, March 1, 2021

ఈ బండికి లైసెన్స్.. రిజిస్ట్రేషన్ అవసరం లేదు

కొత్త టూవీలర్ కొందామనుకుంటున్నరా? అయితే మీ కోసం అదిరిపోయే వార్త. ఈ బండి కొంటే రిజిస్ట్రేషన్ చేయించే పనుండదు. రోడ్డు మీద బండి నడపనీకె లైసెన్స్ లేకపోయినా సరే. ఇంతకీ బండి పేరేంటిది అని డౌటొచ్చిందా? అయితే ఈ స్టోరీ మొత్తం సదువుర్రి మీకే తెలుస్తది.
ఒడిస్సీ అనే దేశీ ఎలక్ట్రిక్ టూవీలర్ల కంపెనీ మార్కెట్లకి కొత్తగా ఓ స్కూటర్ తీసుకొచ్చింది. దీని పేరు ఈ2గో ఈవీ. ఈ బండి ఛార్జింగ్ తోటి నడుస్తదన్నట్టు. దీని స్పెషాలిటీ ఏందో తెలుసా? ఈ స్కూటర్‌కు మోటార్ వెహికల్స్ చట్టం వర్తించదు. అంటే.. రిజిస్ట్రేషన్ చేయించే పనుండదు. బండి నడపనీకె డ్రైవింగ్ లైసెన్స్ తో పని లేదన్నమాట.
ఈ స్కూటర్ ఈ2గో, ఈ2గో లైట్ రెండు వేరియంట్లలో దొరుకుతుంది.ఈ2గో ధర రూ.52,999గా, ఈ2గో లైట్ ధర రూ.63,999గా ఉంది. యూత్, మహిళల కోసం ఈ బండి డిజైన్ చేశిర్రట కంపెనోళ్లు. ఈ ఒడిస్సీ స్కూటర్లు గంటకు 25 కి.మీ స్పీడుతో పరుగులు తీస్తయి. ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెట్టుకుంటే 60 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. బ్యాటరీ ఫుల్ కావడానికి 3 నుంచి 4 గంటల టైమ్ పడుతుంది.మీకు ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డు మీద జామ్.. జామ్ అని దూసుకుపోవాలంటే ఈ స్కూటర్లు కొనుక్కోండి.

- Advertisement -

Latest news

Related news