అమెరికా రాజధానిలో చెలరేగిన అల్లర్లు, హింసాత్మక పరిస్థితులు ఇతర రాష్ట్రాలకూ విస్తరిస్తున్నాయి. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మద్తతుదారులు అనేక రాష్ట్రాల్లో ఆందోళనలకు దిగడంతో గవర్నర్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున భద్రతా దళాలను మొహరించారు. కన్సాస్, ఓహియో, మిన్నెసొటా, కాలిఫోర్నియా, జార్జియా, ఇండియానా, న్యూమెక్సికోల్లో ట్రంప్ మద్దతుదారులు నిరసన ప్రదర్శనలను చేపట్టారు. గవర్నర్ కార్యాలయాల ముందు బైఠాయించారు. వుయ్ స్టాండ్ విత్ ట్రంప్..వుయ్ వాంట్ జస్టిస్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.