అతని అకౌంట్లో రూ.1800 కోట్లున్నయ్.. కానీ అందులోంచి ఒక్క రూపాయి తీసుకోలేడు. కారణం.. దానికి అవసరమైన పాస్వర్డ్ మరచిపోయాడు.
క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ లో అమెరికాకు చెందిన స్టీఫన్ థామస్ అనే వ్యక్తి ఇన్వెస్ట్ చేశాడు. ప్రస్తుతం అతని వద్ద 7002 బిట్ కాయిన్లు ఉన్నాయి. ప్రస్తుత విలువ ప్రకారం వాటి విలువ 24.5 కోట్ల డాలర్లు(సుమారు రూ.1800 కోట్లు)కు సమానం.
బిట్ కాయిన్ల కీస్ అన్నింటినీ ఐరన్‌కీ అనే ఎన్క్రిప్టెడ్ హార్డ్ డ్రైవ్‌లో పెట్టుకున్నాడు. ఇప్పుడా దాన్ని పాస్ వర్డుని థామస్ మర్చిపోయాడు. గరిష్ఠంగా పది సార్లు మాత్రమే ప్రయత్నించే వీలుంది. ఇప్పటికే 8సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. పదిసార్లూ అయ్యిందంటే ఇక ఎప్పటికీ ఆ డ్రైవ్ ఓపెన్ కాదు. అంటే ఆ డబ్బంతా పోయినట్లే.
క్రిప్టోకరెన్సీ చట్టాల ప్రకారం ప్రతి ఒక్క బిట్‌కాయిన్‌కు ఒక క్రిప్టోగ్రాఫిక్ కీ ఉంటుంది. ఇది సదరు బిట్‌కాయిన్ ఓనర్‌కు మాత్రమే తెలుస్తుంది. ఇలా పాస్వర్డ్లు మరచిపోవడం వల్ల మన కరెన్సీలో రూ.9.5 లక్షల కోట్లు ఇలాంటి క్రిప్టో వాలెట్లలో ఉండిపోయాయని టైమ్స్ రిపోర్ట్ వెల్లడించింది. వీటి విలువ ప్రపంచంలోని ఎన్నో దేశాల జీడీపీ కంటే ఎక్కువ కావడం విశేషం.