18.8 C
Hyderabad
Saturday, January 16, 2021

రోడ్డే లేకుండా నగరం నిర్మిస్తున్నారు.. ఎక్కడో తెలుసా?

ఎక్కడికైనా పోవాలంటే.. బండో, కారో, బస్సో ఎక్కి పోతం. లేదంటే.. సక్కగ రోడ్డు పట్టుకొని నడుసుకుంట పోతం. అసొంటిది అసలు రోడ్డే లేకుంటె ఎట్ల పోతం.. అసలు రోడ్డు లేకుండా నగరం ఎట్ల కడుతరు? ఇంతకీ  నగరం ఏడ కడుతున్నరు అని పరేషాన్ అయితున్నరా? రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ పుణ్యమా అని ఎన్నో.. ఎన్నెన్నో ఆవిష్కరణలు చేస్తున్నరు. ఇప్పటికే పొగ లేని వాహనాలు వచ్చేశినయ్. ముందు ముందు అసలు కార్లు, బైకులు కూడా లేకుండా.. ఉన్నా అవి నడపడానికి రోడ్లు లేకుండా నగరం కట్టనీకె ప్లాన్ చేశిర్రు దుబాయ్ రాజు. ఆ నగరం పేరే ద లైన్ సిటీ.

కాలుష్యం అనే  ఊసే లేకుండా సౌదీ అరేబియా ఓ నగరం కట్టనీకె ప్లానింగ్ జేశింది. 170 కిలోమీటర్ల పొడుగున ఈ నగరం కడుతురట.  నగరం కట్టనీకె దాదాపు 15 లక్షల కోట్ల డాలర్లు ఖర్సయితట. సక్కగ.. స్కేల్ పెట్టి గీత గీశినట్టు ఉండెటట్టు ఇంజినీర్లు ప్లానింగ్ సుత తయార్ జేశిర్రట. దుబాయ్ సర్కార్ ఇప్పటికే 36 లక్షల కోట్ల ఖర్సుతోటి నియోమ్ అనే ప్రాజెక్టు మొదలుపెట్టింది. ఆ ప్రాజెక్టుల భాగమే ఈ రోడ్లు లేని లైన్ సిటీ అన్నట్టు.

ఈ సిటీల సూద్దామన్నా రోడ్లు ఉండవు. కానీ.. ఇంట్లకెళ్లి అడుగు బైటపెడితే సాలు.. మార్కెట్, ఆఫీస్, దవాఖాన, షాపింగ్, షికారు ఇట్ల ఏడికి పోవాలన్నా జస్ట్ ఐదు నిమిషాలల్ల సైకిల్ మీదనో, నడుసుకుంటనో పోవచ్చట. జెరంత దూరం ఉంటే.. 20 నిమిషాలు పడుతదట. మరి.. రోడ్లు లేనప్పుడు ఎట్ల పోతరు అని డౌటొచ్చిందా? ఇప్పటికే ఇటలీల పియాజ్జాలు అని సరికొత్త టెక్నాలజీతోటి నడిశే ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ ఉంది. ఇవి సిటీ కింద భూగర్భంలో ఉంటాయి. రెండు పొరల్లో పియాజ్జాలు నడవనీకె ట్రాన్స్ పోర్ట్ మార్గాలు ఉంటయన్నట్టు. ఒక పొరల మనుషులు.. ఇంకో పొరల సరుకులు రవాణా చేస్తరు. ఈ సిటీలో ఒక చోటు నుంచి మరో చోటుకు స్పీడుగా వెళ్లొచ్చన్నమాట. ఈ సిటీ వల్ల పదేళ్లలో 3.80 లక్షల ఉద్యోగాలు సృష్టించి, సర్కారుకు ఈ నగరం తరపున దాదాపు రూ.3.5 లక్షల కోట్ల ఆందాని అందించేటట్టు ప్లాన్ చేస్తున్నరట. ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభంల ఈ సిటీ నిర్మాణ పనులు మొదలు పెడుతరట. చమురుపై ఆధారపడి ఉన్న సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థకు ఈ సిటీ దన్నుగా నిలబెట్టేటందుకు ప్లానింగ్ చేస్తున్నరు. పెరుగుతున్న భూతాపం, స్వచ్ఛ ఇంధనాలపై పెరుగుతున్న అవగాహన వంటివాటి నేపథ్యంలో భవిష్యత్తులో ఆ ఆదాయం తగ్గే ప్రమాదం ఉంది. అందుకే సౌదీ ఆదాయం కోసం చమురుపై ఆధారపడకుండా పర్యాటక ఆకర్షణలు డెవలప్ చేసే ఆలోచన చేస్తోంది. సౌర, పవన విద్యుత్, హైడ్రోజన్‌ ఆధారిత రవాణా వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రత్యామ్నయ ఆదాయ మార్గాలను సిద్ధం చేసుకునే పనిలో పడింది. అందుకు నాందీ ఈ నియోమ్‌ ప్రాజెక్ట్.. ద లైన్ సిటీ అన్నట్టు.

- Advertisement -

Latest news

Related news

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...

అందరూ కలిసి ఊరికి బర్త్ డే చేశిర్రు

ఇదేం విచిత్రం.. ఎవరైనా మనుషులకు బర్త్ డే చేస్తరు. పైసలున్నోళ్లయితే.. పెంచుకునే కుక్కపిల్లలకు, పిల్లి పిల్లలకు బర్త్ డేలు చేస్తరు. కానీ.. ఊరికి బర్త్ డే చేసుడేంది అని ఆలోచిస్తున్నరా?...

రియల్ హీరో సోనూసూద్ మ్యూజిక్ వీడియో చూశారా..

రియల్ హీరో సోనూసూద్.. తొలిసారిగా ఓ మ్యూజిక్ వీడియో ‘పాగ‌ల్ న‌హీ హోనా’లో నటించాడు. ఆర్మీ ఆఫీసర్ గా కన్పించిన ఆ మ్యూజిక్ వీడియో రీల్ హీరోగా కన్పించి తన...

పాక్ కెప్టెన్ బాబర్ మీద లైంగిక వేధింపుల కేసు నమోదు

పాకిస్తాన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్ చిక్కుల్లో పడ్డారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని మోసం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో లాహోర్‌ అదనపు సెషన్స్‌ కోర్టు...