వార్తా సంస్థలు ఇచ్చే న్యూస్ ఫీడ్ వల్ల గూగుల్, ఫేస్ బుక్ ఆర్జించే ఆదాయంలో ఆయా సంస్థలకు కూడా పరిహారం చెల్లించాలంటూ ఆస్ట్రేలియా తెచ్చిన కొత్త చట్టాన్ని గూగుల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. స్థానిక పత్రికలకు ఆదాయాన్ని ఇవ్వడం సాధ్యమయ్యే విషయం కాదని, చట్టం ద్వారా తప్పనిసరి చేస్తే ఆస్ట్రేలియాలో తమ సెర్చింజన్, ఫేస్ బుక్ ను ఆపేస్తామని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ మెల్ సిల్వా హెచ్చరించారు. గూగుల్ వార్నింగ్ పై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలో మీరు ఏంచేయాలో నిర్ణయించేది మా ప్రభుత్వం, పార్లమెంట్ అన్నారు. అలాంటి హెచ్చరికలకు తాము స్పందించబోమన్నారు. స్థానిక మీడియా ఇండస్ట్రీకి మద్దతుగా ఆస్ట్రేలియా ఈ చట్టం చేసింది.