మరో 12 రోజుల్లో దిగిపోనున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. తాను చేసిన తప్పులన్నింటి నుంచీ సెల్ఫ్ పార్డాన్ (తనకు తాను క్షమాభిక్ష) చేసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. అమెరికా పార్లమెంట్ భవనం క్యాపిటల్ హిల్‌పై తన మద్దతుదారుల దాడి నేపథ్యంలో పదవి నుంచి దిగిపోయిన తర్వాత తనపై విచారణ జరిగే అవకాశముందని ట్రంప్ భావిస్తున్నారు. ఆ భయంతోనే తనకు తాను క్షమాభిక్ష పెట్టుకునే దిశగా ఆలోచన చేస్తున్నట్లు గురువారం న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, ప్రెసిడెంట్ తనకు తాను క్షమాభిక్ష పెట్టుకోవడం కుదరదు అని చాలా మంది రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్షమాభిక్ష అనేది ఒక వ్యక్తి మరో వ్యక్తికి ఇచ్చేది తప్ప.. తనకు తాను ఇచ్చుకునేది కాదు అని జార్జ్‌టౌన్ ప్రొఫెసర్ లూయిస్ సీడ్మన్ అన్నారు.
నిక్సన్ ఒక్కడే..
1974లో అప్పటి ప్రెసిడెంట్ నిక్సన్ వాటర్‌గేట్ స్కాండల్ నుంచి బయటపడేందుకు ప్రయత్నించాడు. న్యాయశాఖ అభ్యంతరాలతో ఆ ప్రయత్నం ముందుకుసాగలేదు. దీంతో తాను ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పుకోని అప్పటి వైస్ ప్రెసిడెంట్ ను ప్రెసిడెంట్ గా చేసి అతనిచే క్షమాభిక్ష పొందారు. అనంతరం తిరిగి ప్రెసిడెంట్‌గా భాద్యతలు చేపట్టారు. ఇలా అమెరికా చరిత్రలో క్షమాభిక్ష పొందిన ఏకైక ప్రెసిడెంట్ గా నిక్సన్ నిలిచారు.