32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

గూగుల్ వివాదాలు.. ఇద్దరు రాజీనామా

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ లో వివాదాలు తారాస్థాయికి చేరాయి. వైవిధ్యం, నైతిక విలువల విషయంలో కొనసాగుతున్న వివాదాల కారణంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ సైంటిస్ట్ టిమ్నిట్ గెబ్రూపై గూగుల్ వేటు వేసింది. గెబ్రూని తొలగించడాన్ని నిరసిస్తూ ఇద్దరు సీనియర్ టెకీలు గూగుల్ కు గుడ్ బై చెప్పారు. యూజర్ సెక్యూరిటీ వ్యవహారాలను డీల్ చేసే బకర్ గత 16ఏళ్లుగా గూగుల్ లో సేవలందిస్తున్నారు. గత నెలలో గెబ్రూ నిష్క్రమించడంతో డేవిస్ బకర్ సైతం రాజీనామా చేశాడు.
డైవర్సిటీపై గూగుల్ పనిచేస్తున్నా.. సంస్థలో అభిప్రాయాలు వెల్లడించలేని పరిస్థితి నెలకొందని మరో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వినీష్ కన్నన్ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన గూగుల్ నుంచి వైదొలగుతున్నట్టు ట్వీట్ చేశారు. గెబ్రూ, ఏప్రిల్ క్రిస్టియానాల పట్ల గూగుల్ తీరు సరిగ్గా లేదని.. గెబ్రూ, క్రిస్టియానాలు నల్లజాతికి చెందిన వారు కావున వారి మీద వివక్ష చూపారని గూగుల్ యాజమాన్యం మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

Latest news

Related news