29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ఎడారిలో మంచు.. ఎక్కడంటే..

చలికాలంలో చల్లగా ఉండడం కామన్. ఎత్తైన కొండ ప్రాంతాల్లో అయితే చలి మరీ ఎక్కువై మంచు కురుస్తూ ఉంటుంది. కానీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఎడారైన సహారాలో ఏడాదంతా వేడిగానే ఉంటుంది. అలాంటి ప్రాంతంలో కూడా ఇప్పుడు మంచు కురిసి.. అందరినీ ఆకర్షిస్తుంది.


సహారా ఎడారిలో మంచుపడటం అంటే నిజంగా అద్భుతమే అనుకోవాలి. ఎందుకంటే ఏ కాలంలో అయినా సహారాలో మండుటెండ‌లే దర్శనమిస్తాయి. కానీ, ఈ శీతాకాలంలో మాత్రం ఇలా ఇసుక తిన్నెల్లో మంచు పరుచుకోవడం అందరినీ ఆకర్షిస్తుంది. మంచు కురుస్తుండ‌టంతో అక్కడి ఉష్ణోగ్రతలు జీరో సెల్సియ‌స్‌కు పడిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఫొటోగ్రాఫర్లు ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సహారాలో 37 సంవత్సరాల తర్వాత 2016లో ఒకసారి మంచు పడగా, మళ్లీ నాలుగేళ్లకు ఇప్పుడు మంచు కురిసింది. దీంతో సహరా చుట్టూ నివసించే వారు ఆ అరుదైన దృశ్యాన్ని చూసి ఆనందిస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news