22.9 C
Hyderabad
Sunday, January 17, 2021

అంతరిక్షంలో పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్

చంద్రుడు, అంగారకుడిపై ప్రయోగాలు చేపట్టేందుకు ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్‌‘ చేపట్టిన స్టార్‌షిప్‌‘ నమూనా అంతరిక్షంలో రాకెట్‌ పేలిపోయింది. అమెరికాలోని టెక్సాస్‌ తీరంలో బుధవారం చేసిన ఈ ప్రయోగంలో ప్రోటోటైప్‌ రాకెట్‌ భూమిపై దిగే సమయంలో కుప్పకూలింది. ఈ విషయాన్ని స్పేస్‌ఎక్స్‌ వెల్లడించింది. ఈ మేరకు రాకెట్‌ లాంఛింగ్‌ పేలిపోయిన దృశ్యాలను స్పేస్ఎక్స్ ట్విట్టర్‌ అధికారిక ఖాతాలో ప్రసారం చేసింది. 

ప్రయోగం ఏంటి అసలు?

మార్స్‌, చంద్రుడి మీదకు మనుషులు, సామగ్రిని తీసుకుపోయి, తిరిగి తీసుకువచ్చేందుకు ‘స్పేస్‌ఎక్స్‌’ సంస్థ ‘స్టార్‌షిప్‌’ సిరీస్‌ పేరిట వ్యోమనౌకలను తయారు చేస్తున్నది. ఈ ప్రయోగాలు ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. అందుకనే, వీటికి సంబంధించిన నమూనా రాకెట్లను అసలు ప్రయోగానికి ముందుగా పరీక్షిస్తారు. ఇందులో భాగంగానే ‘స్పేస్‌ఎక్స్‌’ ఈ ప్రయోగం చేపట్టింది. స్టార్‌షిప్‌ నంబర్‌ 8 రాకెట్‌లోని మెటల్‌ కవచం దృఢత్వం, మూడు ఇంజిన్ల పనితీరు, భూమిపైకి రాకెట్‌ తిరిగి చేరుకునే సమయంలో ఎదురయ్యే సవాళ్లు ఈ ప్రయోగంతో అంచనా వేశారు.

ఎందుకు పేలిపోయింది?

ప్రయోగంలో భాగంగా స్టార్‌షిప్‌ నమూనా రాకెట్‌ తొలుత అనుకున్నట్టుగానే నింగిలోకి దూసుకుపోయింది.ప్రోగ్రామ్‌ ప్రకారం.. రాకెట్‌లోని మొత్తం మూడు ఇంజిన్‌లలో.. రెండు ఇంజిన్‌లు పనిచేయడం ఆగిపోయిన వెంటనే రాకెట్‌ను నిర్ణీత ఎత్తుకు వెళ్లి.. తిరిగి భూమి మీదకు దూసుకురావడం ప్రారంభించింది. 4.45 నిమిషాల అనంతరం మూడో ఇంజిన్‌ కూడా సరైన సమాయానికే ఆగిపోయింది. గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో దూసుకువస్తున్న రాకెట్‌ వేగాన్ని అదుపు చేయడానికి మొదటి రెండు ఇంజిన్‌లు స్టార్ట్‌ అయ్యాయి. అయితే ఊహించలేని విధంగా రాకెట్‌ భూమిని వేగంగా ఢీకొట్టి  పేలిపోయింది. ఈ విస్ఫోటనం వల్ల అసలు ప్రయోగం మొదలుపెట్టడానికి కావలసిన సమాచారం లభించిందని స్పేస్‌ఎక్స్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ తెలిపారు.

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...