కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సాగు చట్టాలను అమలును నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చర్చల కోసం కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం సాగు చట్టాలపై తమ అభ్యంతరాలను కమిటీకి చెప్పాలని రైతులకు సూచించింది. వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటి, హర్సిమ్రాత్ మన్, ప్రమోద్ జోషి తదితరులను కమిటీ సభ్యులుగా నియమిస్తూ కమిటీ ఏర్పాటు చేసింది.