22.6 C
Hyderabad
Saturday, January 16, 2021

ముంబై పబ్బులో సురేష్ రైనా అరెస్ట్

టీమిండియా మాజీ క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్ ప్లేయర్, డేరింగ్ డాషింగ్ ఫీల్డర్, బ్యాట్స్ మెన్ సురేశ్‌ రైనాను సోమవారం రాత్రి ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ముంబయి విమానాశ్రయం సమీపంలోని ఓ పబ్‌లో సింగర్‌ గురు రంధవతో పాటు రైనాను అరెస్టు చేశామని స్థానిక పోలీసులు వెల్లడించారు. నిబంధనలకు విరుద్దంగా పబ్‌ నిర్వహించడంతో పాటు కరోనా నియమాలు పాటించకుండా వ్యవహరించినందుకు దాడులు జరిపారు. ఆ సమయంలో అక్కడ ఉన్న రైనాతో పాటు.. మరో 34 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని బెయిల్ పై విడిచిపెట్టారు.

రైనా ఈ సంవత్సరం ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన మిత్రుడు, మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించిన అరగంటలోనే రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. 2008 నుంచి చెన్నై తరఫున ఆడుతున్న రైనా ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 5,878 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, 5,368 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు.

- Advertisement -

Latest news

Related news

కొవిడ్ వ్యాక్సిన్ బండికి బాజాభజంత్రీలతో స్వాగతం

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని అన్నీ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లో...

మొదటిరోజు వాక్సినేషన్ విజయవంతం

రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. మొత్తం 4296 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఈరోజు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా.. 3962 మంది వాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...

1020వ గుండెను కాపాడిన సూపర్ స్టార్

సాటివారికి సాయం చేయడంలో ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. తాను నిజంగా కూడా శ్రీమంతుడినే అని నిరూపించుకున్న సంఘటనలు బోలెడున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత...

తొలి బర్డ్ ఫ్లూ కేసు.. నేషనల్ పార్క్ బంద్

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది. దీని శాంపిల్స్ ను భోపాల్ లోని ఐసీఎఆర్...