ఇప్పటివరకూ కృత్రిమ గుండె, కృత్రిమ కిడ్నీ ఇలా కొన్ని ఆర్టిఫీషియల్ ఆర్గాన్స్ మాత్రమే ఉన్నాయి. కానీ కన్నుకు రీప్లేస్మెంట్ ఇప్పటివరకూ కనుక్కోలేకపోయారు. అయితే తాజాగా ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు ఈ రికార్డు కూడా బ్రేక్ చేశారు. సింథటిక్ కార్నియా సృష్టించి.. అంధుడి కళ్లల్లో వెలుగులు నింపారు.

ఇజ్రాయిల్‌లోని రాబిన్ మెడికల్ సెంటర్ వైద్యులు ప్రపంచంలోనే తొలి ఆర్టిఫిషియల్ కార్నియా ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీని సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేసి, రికార్డు సృష్టించారు. ఇజ్రాయెల్‌కు చెందిన 78 సంవత్సరాల వ్యక్తి పదేళ్ల క్రితం కంటిచూపును కోల్పోగా, అతడికి ఈ నెల 11న రాబిన్ మెడికల్ సెంటర్లో ప్రొఫెసర్ ఇరిత్ బహార్ ఆధ్వర్యంలో సింథటిక్ ‘కార్నియా’ను అమర్చి కృత్రిమ చూపు తెప్పించారు. సర్జరీ అయిన తర్వాత అతను అందర్నీ గుర్తుపట్టాడు, అక్షరాలు కూడా చదివాడు.
దీని గురించి ప్రొఫెసర్ మాట్లాడుతూ.. ‘ఇది మిలియన్ల జీవితాలను తప్పకుండా ప్రభావితం చేస్తుంది. ఈ కార్నియాను ఇంప్లాంట్ చేయడం చాలా సులభం. కేవలం గంటలో సర్జరీ పూర్తవుతుంది. ఈ సింథటిక్ కార్నియా ద్వారా ఫ్యూచర్ లో చాలామంది అంధులకు చూపు తెప్పిచొచ్చు’ అని అన్నారు.