మయన్మార్లో ఫిబ్రవరి 1న తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్న సైన్యం ప్రజా ఆగ్రహానికి తలొంచింది. ఎన్ ఎల్డీ పార్టీ అధ్యక్షురాలు అంగ్ సాన్ సూకీతోపాటు పలు రాజకీయ, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని నిర్బంధించింది. దీనికి తోడు దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. దీంతో ప్రజలు ఆందోళనల బాటపట్టారు. నిన్న దేశ వ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. దీంతోపాటు పెద్దయెత్తున్న నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అంగ్ సాన్ తో పాటు వెంటనే ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని నినదించారు. సైన్యం ఆంక్షలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆందోళన నేపథ్యంలో మయన్మార్ సైన్యం వెనక్కు తగ్గింది. ప్రజలను శాంత పరిచేందుకు దేశంలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది.