23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

లైవ్‌లో విషాధం మిగిల్చిన వోడ్కా ఛాలెంజ్‌

రష్యాలో సరదాగా ప్రారంభించిన వోడ్కా ఛాలెంజ్ విషాధం మిగిల్చింది. యూట్యూబ్‌ లైవ్‌లో 1.5లీటర్ల వోడ్కా తాగిన వారికి రివార్డుగా పెద్ద మొత్తం ఇస్తానని ఓ యూట్యూబర్‌ ప్రకటించాడు. ఏజ్‌ లిమిట్‌ లేకపోవడంతో ఈ సరదా ఛాలెంజ్‌ లో పాల్గొనేందుకు చాలామంది ఆసక్తి చూపించారు.

రష్యాకు చెందిన 60 ఏళ్ల యూరి దుషెచ్కిన్‌ అనే వ్యక్తి ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి వోడ్కాను తాగడం ప్రారంభించాడు. అయితే 1.5లీటర్ల వోడ్కా తాగిన తర్వాత ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. లైవ్‌ స్ట్రీమింగ్‌లో అప్పటిదాకా ఎంతో హుషారుగా కనిపించిన ఆయన వోడ్కా సేవిస్తూ చనిపోవడం నెటిజన్లను షాక్‌కి గురిచేసింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. రష్యన్‌ సెనేటర్‌ అలెక్సీ పుష్కోవ్ సైతం ఇలాంటి ప్రాణాంతకమైన ఛాలెంజ్‌లపై నిషేధం విధించాలని డిమాండ్‌ చేశారు.

సోషల్‌ మీడియాలో ఎన్నోరకాల ఛాలెంజ్‌లు విసురుతుంటారు. అందులో సరదా సంగతి అటుంచితే, కొన్ని ప్రాణాల మీదకి తెచ్చే ఇలాంటి ఛాలెంజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు.  

- Advertisement -

Latest news

Related news