21.7 C
Hyderabad
Friday, January 22, 2021

ట్రంప్ పై ట్విటర్ బ్యాన్.. సరైందే కానీ..

అమెరికా పార్లమెంట్ భవనం క్యాపిటల్‌ హిల్‌ పై ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారుల దాడి నేపథ్యంలో ట్విట్టర్‌ ట్రంప్‌ అకౌంట్‌ని శాశ్వతంగా బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ట్విట్టర్‌ సీఈఓ జాక్‌‌ డోర్సే ట్రంప్‌ అకౌంట్‌ బ్యాన్‌పై స్పందించారు. ట్రంప్ అకౌంట్ పై శాశ్వతంగా నిషేధం విధించడం సరైందే కానీ.. ఇందుకు తానేం గర్వపడటం లేదన్నారు. పైగా ఇలా చేయడం.. మాట్లాడే స్వేచ్ఛను హరించినట్లే అని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విటారు.

ట్రంప్‌ సోషల్‌ మీడియా అకౌంట్‌పై నిషేధం విధించడాన్ని జర్మనీ చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ కూడా తప్పుబట్టారు. ‘భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పరిమితులను చట్ట సభ్యులు నిర్ణయించాలి తప్ప ప్రైవేటు సంస్థలు కాదు’ అని ట్విటారు.

అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ విజయాన్ని అంగీకరించని ట్రంప్ ట్విటర్ లో పలు విమర్శలు చేశారు.  బైడెన్‌ విజయాన్ని ధ్రువీకరించేందుకు కాంగ్రెస్‌ సమావేశమైన సందర్భంగా ట్రంప్ మద్దతుదారులు పెద్దయెత్తున్న పార్లమెంట్ భవనం బయట నిరసన చేపట్టి పార్లమెంట్ పై దాడి చేశారు. ఈ సమయంలో ట్రంప్ చేసిన ట్విట్ వివాదస్పదమైంది. ఈ నేపథ్యంలో ప్రతినిధుల సభలో ట్రంప్ అభిశంసనకు గురై.. అమెరికా చరిత్రలో రెండు సార్లు అభిశంసన గురైన మొదటి ప్రెసిడెంట్ గా నిలిచారు.

- Advertisement -

Latest news

Related news

కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన కిసాన్‌మోర్చా

కొత్త సాగు చట్టాలను తాత్కాలికంగా 18 నెలలపాటు నిలిపివేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సంయుక్త కిసాన్‌మోర్చా కార్యవర్గం తిరస్కరించింది. మూడు వివాదాస్పద సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు...

నల్గొండ రోడ్డు ప్ర‌మాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నల్గొండ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాలపాలై...

ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది. కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల...

రూ.190కే ల్యాప్‌టాప్‌.. ఆర్డర్ చేస్తే..

అమెజాన్‌ సైట్‌లో రూ.23,499 విలువైన ల్యాప్‌టాప్‌ కేవలం రూ.190కే ఆఫర్‌ కింద అందుబాటులో ఉండటంతో ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్‌ మహాపాత్ర అనే లా స్టూడెంట్ ఆర్డర్ చేశాడు. అయితే,...