29.3 C
Hyderabad
Monday, March 1, 2021

రేపటితో ట్రంప్ గుడ్ బై

అమెరికాలో ట్రంప్ శకం రేపటితో ముగుస్తుంది. నాలుగేళ్ల పాటు రకరకాల ఆటుపోట్ల మధ్య సాగిన డొనాల్డ్‌ ట్రంప్‌ హయాం 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తుంది. అమెరికా 46వ అధ్యక్షుడిగా.. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్, దేశ ఉపాధ్యక్షురాలిగా భారతీయ మూలాలున్న కమలాహారిస్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినందుకు ట్రంప్ ఇంకా కోపంగానే ఉన్నారు. వైట్ హౌస్ ను వీడేందుకు ఇష్టపడట్లేదు. అందుకే సంప్రదాయాలకు విరుద్ధంగా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కూడా హాజరు అవ్వడం లేదు.

- Advertisement -

Latest news

Related news