అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ మీద షాక్ తగులుతుంది. ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్లపై వరుసగా వేటు పడుతుంది. రీసెంట్గా ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేసిన తర్వాత ఇప్పుడు యూట్యూబ్ అకౌంట్‌పై కూడా వేటు పడింది.
క్యాపిటల్ హిల్ దాడి ఘటన తర్వాత సోషల్ మీడియా సంస్థలన్నీ ట్రంప్‌ను వరుసగా బ్లాక్ చేస్తున్నాయి. ట్విటర్ అకౌంట్‌ను పర్మినెంట్‌గా, ఫేస్బుక్, ఇన్‌స్టా అకౌంట్లను తాత్కాకాలికంగా బ్యాన్ అయ్యాయి. ఇప్పుడేమో యూట్యూబ్. ట్రంప్ యూట్యూబ్ కు సుమారు 2.7మిలియన్ల సబ్ స్క్రైబర్లు ఉన్నారు.

ట్రంప్ ఛానల్లో అప్లోడ్ చేసిన కంటెంట్‌ను వయొలెన్స్‌ను ప్రేరేపించేలా ఉందని ట్రంప్‌పై ఆరోపణలు ఉన్నాయి. వాటికి యూట్యూబ్ రియాక్ట్ అవుతూ ట్రంప్ ఛానెల్‌ను ఒక వారం సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. తమ ప్లాట్‌ఫామ్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌ను బ్రేక్ చేసినందుకుగానూ ఈ సస్పెన్షన్ కొంతకాలం పొడిగించే అవకాశం కూడా ఉందని చెప్పింది. ట్రంప్ ఛానల్లోని కంటెంట్‌ను జాగ్రత్తగా రీవ్యూ చేసిన తరువాత, హింసను ప్రేరేపిస్తుందన్న అబ్జక్షన్ లను పరిశీలిస్తూ.. తాజాగా అప్లోడ్ చేసిన కంటెంట్‌ను తొలగించామని ఒక ప్రకటనలో చెప్పింది.