26.6 C
Hyderabad
Sunday, January 24, 2021

ట్రంప్‌ ట్విటర్‌ అకౌంట్ పై నిషేధం

అమెరికా పార్లమెంట్ భవనం క్యాపిటల్ హిల్స్ పై ట్రంప్ మద్దతుదారుల దాడి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాను నిషేధిస్తున్నట్లు ట్విటర్ ప్రకటించింది. ఆయన తన సందేశాల ద్వారా మరింత హింసను ప్రోత్సహించే ప్రమాదముందని పేర్కొంది. ఇటీవల ఆయన చేసిన ట్వీట్లను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతోపాటు బైడెన్‌ బాధ్యతలు స్వీకరించే రోజువరకూ ట్రంప్‌ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను నిలిపివేస్తున్నట్లు ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ చెప్పారు. ప్రెసిడెంట్ ట్రంప్ తన అధికారిక ట్విటర్‌(ప్రెసిడెంట్‌ ట్రంప్‌) ద్వారా స్పందించారు. వాక్‌ స్వాతంత్ర్యాన్ని ట్విటర్‌ హరిస్తోందని, డెమోక్రాట్లు, ర్యాడికల్‌ లెఫ్ట్‌తో ట్విటర్‌ ఉద్యోగులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ట్రంప్‌ ‘టీమ్‌ ట్రంప్‌’ ఖాతాని వాడటంతో దాన్ని కూడా ట్విటర్ నిషేధించడం గమనార్హం.

- Advertisement -

Latest news

Related news

బుడ్డోడి టాలెంట్ కి మంత్రి కేటీఆర్ ఫిదా

ఇండియాలో టాలెంట్ కు కొదవ లేదు. ఏ మూల చూసినా.. ప్రతీ ఒక్కరి దగ్గర ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. కాస్త ఎంకరేజ్మెంట్, ట్రైనింగ్ ఇస్తే.. ప్రపంచాన్ని ఓ...

సుధీర్ అదరగొట్టేశాడు!

బుల్లితెర స్టార్ హీరో సుధీర్ జాతీయ స్థాయిలో అదరగొట్టేశాడు. జబర్దస్త్, ఢీ వంటి షోలతో పాటు.. ప్రత్యేక సందర్భాల్లో ఈవెంట్లలో కూడా తన టైమింగ్,...

జాతి నిర్మాణంలో సాహిత్యం పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కవిత

మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ వారి ఆధ్వర్యంలో 610 మంది కవుల భాగస్వామ్యంతో హైదరాబాద్ లో జరిగిన పద్య ప్రభంజనం-దేశభక్తి పద్య బృహత్ సంకలనం ఆవిష్కరణోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత...

ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నారు?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొన్నటివరకూ వైట్ హౌస్‌ను వీడనని మారాం చేశారు. కానీ కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత వీడక తప్పదు కదా. అందుకే అయిష్టంగానే వైట్...