26 C
Hyderabad
Wednesday, January 27, 2021

వాషింగ్టన్ లో రెండు వారాల ఎమర్జెన్సీ

అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.లో జనవరి 24వ వరకు ఎమర్జెన్సీ విధిస్తూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా జోసెఫ్ ఆర్. బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యగా నగర మేయర్‌ మురియెల్‌ బౌసర్‌ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హఔస్ మీడియా ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. బైడెన్ ప్రమాణ స్వీకారం రోజు కూడా విధ్వంసం జరిగే అవకాశముందని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)  హెచ్చరికల నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించారు. జనవరి 6న క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారుల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఫైరింగ్ ఘటనలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -

Latest news

Related news

త్రివర్ణ హైదరాబాద్

72వ గణతంత్ర దినోత్సం వేళ హైదరాబాద్ నగరంలోని ప్రముఖ చారిత్రక భవనాలు త్రివర్ణ లైటింగ్ తో దేదీప్యమానంగా వెలిగిపోయాయి. వీటి వెలుగులను ఒకే ఫ్రెమ్ లో బంధించేందుకు డ్రోన్ కెమెరాలతో...

సీఎం గొప్ప లౌకికవాది.. మంత్రులు

సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాది, అన్ని మతాలను సమానంగా గౌరవం ఇస్తారని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొత్త సచివాలయంలో ప్రార్థనా మందిరాలను...

ర్యాలీపై ఆగ్రహం.. రైతుల అరెస్ట్.. ట్విట్టర్ ఖాతాలపై కన్ను

గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఈ విషయమై కేంద్ర హోం శాఖ చాలా సీరియస్ గా స్పందించింది....

కూతురుతో రహానె డ్యాన్స్.. వీడియో వైరల్

‘క్వారంటైన్‌లో తొలిరోజు సరదాగా గడిచిందంటూ..’ అజింక్య రహానె భార్య రాధిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూతురుతో రహానె స్టెప్పులు వేస్తుండగా తీసిన వీడియోను ఆమె...