మన రైతులకు మన దేశంలోనే కాదు. ఇతర దేశాల నుంచి కూడా సపోర్ట్ అందుతుంది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 60 రోజులుగా అన్నదాతలు చేస్తోన్న నిరసనకు ఇంగ్లండ్ లోని రైతులు సంఘీభావం తెలిపారు.

భారతీయ రైతులకు మా సంఘీభావం అంటూ బోర్డు పెట్టుకుని కొందర బ్రిటిష్ రైతులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. మరోపక్క భారత్ లో రైతుల ఆందోళనకు తాము సంఘీభావం తెలుపుతున్నామని.. వ్యవసాయ రంగంలో ఇండస్ట్రియలైజేషన్ ప్రభావం గురించి వివరిస్తూ బ్రిటన్ విదేశాంగ సెక్రటరీకి, భారత ప్రదానికి లేఖ రాశామని బ్రిటన్ ది ల్యాండ్ వర్కర్స్ కూటమి తెలిపింది.

ప్రస్తుతం భారతీయులు చేస్తోన్న ఆందోళన.. గడిచిన మూడు దశాబ్దాలలో వ్యవసాయ కమ్యూనిటీ నుంచి జరిగిన అతిపెద్ద ఆందోళనగా ఈ కూటమి చెప్తోంది.