28.3 C
Hyderabad
Wednesday, February 24, 2021

ఉత్తరాఖండ్ జలవిలయంలో 203 మంది గల్లంతు

ఉత్తరాఖండ్ లో పెనువిషాదం నింపిన జలవిలయంలో గల్లంతైన వారు, మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఘటన జరిగిన కొద్దిసేపటికి వరదలో 50 మంది గల్లంతయ్యారని భావించినా.. సమయం గడుస్తున్నా కొద్ది గల్లంతైన వారి సంఖ్య 170కి చేరింది.

అన్ని మార్గాల్లోని సమాచారాన్ని సేకరించిన యంత్రాంగం వరదల్లో గల్లంతైన వారి సంఖ్య 203 అని తేల్చింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ అధికారికంగా ప్రకటించారు.


ఉత్తరాఖండ్, చమోలీ జిల్లాలోని జోషిమఠ్‌ సమీపంలో నందాదేవి పర్వతం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంది. ఉన్నట్టుండి మంచు చరియలు విరిగి.. ధౌలిగంగా నదిలో పడడం వల్ల నది పోటెత్తింది. పెద్ద పెద్ద మంచు చరియలు పడడంతో ఆ ధాటికి.. వరద నీరు వేగంగా ప్రవహించింది.

బండరాళ్లు, మంచు శకలాలు, బురదతో కూడిన నీటి ప్రవాహం వేగంగా కిందకు ప్రవహించడంతో ధౌలిగంగా నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. నది వరద ప్రవాహ ధాటికి తపోవన్‌-రేణిలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న 13.2 మెగావాట్ల రిషిగంగ విద్యుత్ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైంది. తపోవన్-విష్ణుగఢ్ ప్రాజెక్టు కూడా భారీగా దెబ్బతిన్నది. రెండు ప్రాజెక్టుల వద్ద పనిచేస్తున్న వందలాది కార్మికులు బురదలో చిక్కుకుపోయి.. గల్లంతయ్యారు.


తపోవన్ పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 148 మంది, రిషిగంగ వద్ద పనిచేస్తున్న 22 మంది కనిపించకుండా పోయినట్టు ఐటీబీపీ అధికారులు ప్రకటించారు. కాగా.. సోమవారం నాటికి గల్లంతైన వారి సంఖ్య పెరిగింది. తపోవన్ ప్రాజెక్టుకు అనుబంధంగా మరో చోట పనిచేస్తున్న వారు కూడా వరదల్లో కొట్టుకుపోయారు. ప్రాజెక్టు సొరంగ మార్గాల్లో పనిచేస్తున్న 16 మంది తప్ప మిగతా వారి జాడ కూడా దొరకడం లేదు. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 18 మృతదేహాలను వెలికి తీశారు.

- Advertisement -

Latest news

Related news