29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

యూకేలో ప్రారంభమైన వ్యాక్సిన్ మిక్సింగ్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను పలు దేశాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ మెరుగుదలకు నిపుణులు వ్యాక్సిన్ మిక్సింగ్ ట్రయల్ నిర్వహిస్తున్నారు. యూకే ఇప్పటికే వ్యాక్సిన్ మిక్సింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం ఆ దేశంలో ఫైజర్, అక్స్ ఫర్డ్ టీకాలు ఇస్తున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటేనే కరోనా నుంచి పూర్తి రక్షణ ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే బ్రిట‌న్ శాస్త్ర‌వేత్త‌లు వ్యాక్సిన్ మెరుగుదలకు ఇప్పుడు వ్యాక్సిన్ మిక్సింగ్ పై అధ్య‌య‌నం చేపడుతున్నారు. దీనికి అక్కడి ప్రభుత్వం ఇప్పటికే అనుమతి జారీ చేసింది. దీని ప్రకారం ఒకే వ్య‌క్తి రెండు కంపెనీల వ్యాక్సిన్లు ఇచ్చి వ్యాక్సిన్ల పనితీరును పరిశీలించనున్నారు.

వ్యాక్సిన్ మిక్సింగ్ ట్ర‌య‌ల్ కోసం 50 ఏళ్లు దాటిన 800 మంది వాలంటీర్ల‌ను ఎంపిక చేశారు.  వ్యాక్సినేష‌న్ అండ్ ఇమ్యునైజేష‌న్‌లో భాగంగా జరగుతున్న ఈ ట్రయల్ లో భాగంగా వాలంటీర్లకు ముందుగా ఆక్స్ ఫ‌ర్డ్ టీకా లేదా ఫైజ‌ర్ టీకా ఇవ్వ‌నున్నారు. తర్వాత డోసుగా ఇంకో వ్యాక్సిన్ ను మార్చుతారు. 13 నెల‌ల పాటు సాగే ఈ స్ట‌డీలో వాలంటీర్ల‌ ఆరోగ్య పరిస్థితులను రికార్డు చేయనున్నారు. వ్యాక్సిన్ మిక్సింగ్‌తో లాభం జ‌రుగుతుంద‌ని యూకే సైంటిస్టులు భావిస్తున్నారు. ఎబోలా వ్యాధి విష‌యంలో ఇమ్యునిటీ పెంచేందుకు మిక్సింగ్ ప్ర‌క్రియ‌ను వినియోగించ‌నున్న‌ట్లు వారు గుర్తుచేస్తున్నారు.  

- Advertisement -

Latest news

Related news