27.9 C
Hyderabad
Friday, January 22, 2021

ట్విట్టర్ అకౌంట్ తొలగించి ట్రంప్ కే షాకిచ్చింది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ను ట్విట్టర్ సిబ్బంది శాశ్వతంగా తొల‌గించారు. ఈ సాహ‌సోపేత‌, అసాధార‌ణ నిర్ణయం వెనుక ఉన్నది ఎవరో కాదు. మన తెలుగు లాయరే. ట్విట్టర్ సంస్థ లీగల్, పాలసీ, ట్రస్ట్, సేఫ్టీ అంశాలు చూసుకునేది ఆమెనే. పేరు విజ‌య గ‌ద్దె. ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ను ర‌ద్దు చేస్తున్నట్లు వెల్లడించింది కూడా ఈమెనే. హింస చెల‌రేగే ప్రమాదం ఉన్నందున డొనాల్డ్ ట్రంప్ అకౌంట్‌ను ట్విట‌ర్‌ శాశ్వతంగా ర‌ద్దు చేసింది అని విజ‌య ఈ నెల 9న‌ ట్వీట్ చేశారు. 

భారత సంతతికి చెందిన విజ‌య అమెరికాలోని టెక్సాస్‌లో పెరిగారు. ఆమె తండ్రి గ‌ల్ఫ్ ఆఫ్ మెక్సికో ఆయిల్ రిఫైన‌రీల‌లో కెమిక‌ల్ ఇంజినీర్‌. న్యూజెర్సీలో హైస్కూల్‌.. న్యూయార్క్ యూనివ‌ర్సిటీ లా స్కూల్‌లో న్యాయశాస్త్రం చ‌దివారు. 2011లో ట్విట్టర్ సంస్థలో ఉద్యోగంలో చేరారు. గడిచిన పదేళ్ల కాలంలో విజయ చాలా పేరు సంపాదించారు. మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్ సోష‌ల్ మీడియా ఎగ్జిక్యూటివ్ అంటూ విజయను ‘ది పొలిటికో’ అభివ‌ర్ణించింది. 

- Advertisement -

Latest news

Related news

వైరల్ అవుతున్న​ ఎలన్‌ మస్క్‌ చాలెంజ్‌

పెరిగిన జనాభా, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల లాభమేమోగానీ నష్టమే ఎక్కువ ఉందని అర్థమవుతుంది. పచ్చగా ఉండాల్సిన భూమిపై జీవం ఎండిపోతుంది. వాతావరణంలో ఎన్నెన్నో మార్పులొస్తున్నాయి. ప్రస్తుతం మన ఎన్విరాన్‌మెంట్‌కు ఉన్న...

కరోనాను కంట్రోల్ చేయలేక ప్రధాని రిజైన్.. ఎక్కడంటే..

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఎంత గజగజలాడించినా అన్ని దేశాలు ఎంతోకొంత ప్రయత్నం చేస్తూ.. కొంతవరకైనా కట్టడి చేస్తున్నాయి. అయితే ఒక దేశంలో మాత్రం కరోనా వైరస్‌ను నియంత్రించలేక ఏకంగా ప్రధానమంత్రే...

ప్రభాస్ పెళ్లిపై రెబల్ స్టార్ కామెంట్

ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్ ఒకరు. పాన్‌ ఇండియా స్టార్‌గా అదరగొడుతున్న ప్రభాస్.. పెళ్లి గురించి ఎప్పుడూ టాపిక్ వచ్చినా అది హాట్ టాపిక్ గానే ఉంటుంది. బాహుబలి...

మహేశ్ కొత్త ఫొటోలు చూశారా?

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. సర్కారు వారి పాట షూటింగ్ కోసం జిమ్ముల్లో కసరత్తులు...