వాషింగ్టన్ ఇప్పుడు యుద్ధం రాబోతోందా అన్నట్టుగా అంతా హై అలర్ట్ నడుస్తుంది. ఎందుకంటే.. రేపే దేశ నూతన అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ సందర్భంగా వాషింగ్టన్‌తో సహా పలు నగరాల్లో అల్లర్లు చెలరేగే అవకాశముందన్న నిఘా వర్గాల సమాచారంతో సెక్యూరిటీ ఫోర్స్ లు అప్రమత్తమయ్యాయి. వాషింగ్టన్‌ను అష్టదిగ్బంధనం చేశాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే కేంద్రానికి దారితీసే రహదారులను మూసేశారు. వేల మంది పోలీసులతో పాటు, సుమారు 25 వేల మంది నేషనల్ గార్డ్స్‌ను రంగంలోకి దింపారు. క్యాపిటల్ భవనం, వైట్‌హౌజ్‌ల్లోకి ఇతరుల ప్రవేశాన్ని నిషేధించారు.

ట్రంప్ అనుకూల వ్యక్తులు అల్లర్లు చేసే అవకాశం ఉందని ఇన్ఫర్మేషన్ రావడంతో ఎలాంటి అల్లర్లు జరగకుండా పక్కాగా ప్లాన్ చేశారు. బయటి వ్యక్తుల రాకపోకలను నిలిపివేశారు. బైడెన్ ప్రమాణస్వీకార కార్యక్రమ రిహార్సల్స్‌లో పాల్గొన్న సిబ్బందిని కూడా వెంటనే భవనం నుంచి బయటకు పంపించారు.