డబ్ల్యూహెచ్ఓ సభ్యుల ఎంట్రీకి అనుమతి నిరాకరించిన చైనా
చైనా తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అసహనం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి మూలాలపై పరిశోధనకు సిద్ధమైన డబ్ల్యూహెచ్ఓ సభ్యుల ప్రవేశానికి చివరి నిమిషం వరకు అనుమతులు జారీ చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు. వివిధ దేశాల నుంచి నిపుణులు ఇప్పటికే చైనాకు బయలుదేరారని టెడ్రోస్ తెలిపారు.