29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

మీ పేరు కమలా? మీకో బంపర్ ఆఫర్ రెడీగా ఉంది

మీ పేరు కమలా? అయితే మీకో బంపర్ ఆఫర్ రెడీగా ఉంది. ఈ రోజంతా ఉల్లాసంగా ఎంజాయ్ చేసే లక్కీ ఆఫర్ మీ కోసం వేచి చూస్తోంది. ఇంతకీ అదేంటంటే..


అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా పదవి చేపట్టిన మొదటి మహిళగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంలో వండర్ లా థీమ్ పార్క్.. ఆమె విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఒక ఆఫర్ ను ప్రకటించింది. ఆఫర్ ఏంటంటే.. కమల అనే పేరు ఉంటే చాలు. వారికి ఈ రోజు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా పార్క్‌లోకి ఎంటర్ అవ్వొచ్చు.


జనవరి 24,2021న కమల పేరుతో ఉన్నవారికి ఫ్రీ ఎంట్రీ. ఐడీ కార్డును చూపించి ఎంట్రీ పొందొచ్చు. బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్‌లో ఉన్న వండర్ లా థీమ్ పార్క్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. కమల్, కమలమ్, కమలా.. ఇలా కమలకు దగ్గరగా ఉన్న పేర్ల వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ప్రతిపార్కులో ముందుగా వచ్చిన వంద మందికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

- Advertisement -

Latest news

Related news