18.6 C
Hyderabad
Wednesday, October 28, 2020

అంతరిక్షంలో చరిత్ర సృష్టించిన అరబ్‌ ఎమిరేట్స్

యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ చ‌రిత్ర సృష్టించింది. మార్స్ గ్ర‌హానికి ఆర్బిటార్‌ను పంపిన తొలి అర‌బ్ దేశంగా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. తెల్ల‌వారుజామున 1.58 నిమిషాలకు మార్స్ గ్ర‌హానికి అల్ అమాల్ లేదా ద హోప్ అనే ప్రోబ్ ఆర్బిటార్‌ ను పంపించారు. జ‌పాన్‌ లోని త‌నెగాషిమా స్పేస్‌ పోర్ట్ నుంచి హెచ్‌-2ఏ రాకెట్ ద్వారా ఈ ప్ర‌యోగం నిర్వహించారు.మొత్తం 135 మంది ఎమిరేట్ ఇంజినీర్లు, సైంటిస్టులు, ప‌రిశోధ‌కులు ఈ ప్రాజెక్టులో పాల్గొన్నారు.  ఇక ఆరేళ్లుగా ఈ ప్రాజెక్టు కోసం కృషి చేస్తున్న ఎమిరేట్స్ ప్ర‌భుత్వం.. దీని కోసం 735 మిలియ‌న్ల దీర‌మ్‌ ల‌ను ఖ‌ర్చు చేసింది.  రోద‌సి నుంచి ప్రోబ్ ఆర్బిటార్ సిగ్న‌ల్ పంప‌డంతో.. దుబాయ్‌ లో ఆనందోత్స‌హాలు వెల్లువెరిశాయి.

- Advertisement -

Latest news

Related news

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...

నాయిని సతీమణి మృతిప‌ట్ల మంత్రుల సంతాపం

మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిప‌ట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. అహ‌ల్య భౌతిక‌కాయానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.   నాయిని సతీమణి...

సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్ట్

సినీ నటి, బీజేపీ నేత కుష్బూను అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. వీసీకే అధినేత తిరుమావళవన్‎ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుండి చిదంబరంకు వెళ్తుండగా ముత్తుకాడులో...