తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నయి. అన్నాడీఎంకేలో సాగుతున్న కుర్చీ కొట్లాటకు తెరపడింది. అనూహ్యంగా ఏఐడీఎంకే సీఎం అభ్యర్థిగా పళనిపేరును ప్రకటించి అందరికి షాకిచ్చారు తమిళనాడు డిప్యూటీ సీఎం. పార్టీ పగ్గాలు అందుకున్న పన్నీర్ సెల్వం.. పళని పేరును అధికారికంగా ప్రకటించారు.ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. 11మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. అమ్మ పాలన మళ్లీ రావాలన్న సంకల్పంతో సమష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.