అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రెసిడెంట్ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే అమెరికాలో కీలక ఓటర్లైన భారతీయ అమెరికన్లు డెమొక్రాట్స్ అభ్యర్థుల వైపు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. దాదాపు 72 శాతం మంది ఎన్నారై ఓటర్లు బిడెన్ కు ఓటు వేయాలని డిసైడ్ అయినట్టు ఐఏఏఎస్ సర్వేలో తేలింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ కు 22శాతం మంది మద్దతిస్తున్నట్టు ఫలితాలు వెల్లడించింది. ఫ్లోరిడా, మిచిగాన్, పెన్సిల్వేనియా వంటి రాష్ట్రాల్లో ఉపాధ్యక్ష బరిలో ఉన్న డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు అనుకూలంగా ఓట్లు పడే అవకాశం ఉందని పేర్కొంది. భారతీయ అమెరికన్లు ఈ ఎన్నికల్లో ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వ్యవస్థ వంటి ముఖ్యమైన సమస్యలను నొక్కి చెప్పారంటోంది ఐఏఏఎస్.