కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్పార్టీ బలోపేతానికి పటేల్ చేసిన కృషిని కొనియాడారు. ఆయన చాలా కాలంపాటు ప్రజా సేవలోనే జీవితం గడిపారన్నారు. ఫోన్ లో అహ్మద్ పటేల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు మోడీ. ఇటు పటేల్ మృతిపై విచారం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పార్టీకి అహ్మద్ పటేల్ ఓ మూలస్తంభం లాంటివారని.. ఆయన శ్వాస, ఆశ అన్నీ కాంగ్రెసేనని కీర్తించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా అహ్మద్ పటేల్ కన్నుమూత పట్ల స్పందించారు. ఓ తెలివైన, అనుభవజ్ఞుడైన రాజకీయవేత్తను కోల్పోయామన్నారు. ఆయన మరణంతో శూన్యం ఆవహించినట్టయిందని తెలిపారు.