ఆంధ్రప్రదేశ్ ను వాయుగుండం వణికిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉక్కునగరం విశాఖ అతలాకుతలం అవుతోంది. తీరం వెంబడి వీస్తున్న బలమైన గాలులతో..తెన్నేటికి ఓ భారీ నౌక కొట్టుకుని వచ్చింది. బంగ్లాదేశ్‌కు చెందిన 80 మీటర్ల పొడవాటి మర్చంట్ వెసల్ నౌక అర్ధరాత్రి సమయంలో ఇసుక తిన్నుల మధ్య చిక్కుకోగా..అందులోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. యాంకర్లు రెండూ కోల్పోవడంతో సమస్య తలెత్తినట్లు చెబుతున్నారు అధికారులు. అయితే నౌకను చూసేందుకు స్ధానికులు పెద్ద ఎత్తున తీరానికి చేరుకుంటున్నారు.