18.8 C
Hyderabad
Saturday, January 16, 2021

ఇంకా దేవుడు శాసించలేదు.. తలైవా పార్టీ పెట్టలేదు!

నా దారి రహదారి అంటూ.. అదిరిపోయే డైలాగులు చెప్పే తలైవా రజినీకాంత్.. రాజకీయ దారిలోకి ఎప్పుడొస్తాడో మాత్రం ఇప్పటికీ క్లారిటీ ఇవ్వడం లేదు. దేవుడు శాసిస్తాడు.. అరుణాచలం పాటిస్తాడు అనే.. పవర్ ఫుల్ డైలాగ్ సినిమా వరకే పరిమితమా? పార్టీ పెట్టమని ఆ దేవుడు శాసించేదెప్పుడు..? నీ బాటలో నడిచేదెప్పుడు అని సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. కిరాణా దుకాణాల్లో.. అప్పు కోసం అయితే రేపు రా అంటూ కనిపించే బోర్డులా.. రజినీ పార్టీ ప్రస్తావన కూడా.. ఇప్పుడు కాదు తర్వాత అంటూ ఊరిస్తున్నాడు.

మూడేండ్ల క్రితం రాజకీయాల్లోకి వస్తా అని క్లారిటీ ఇచ్చిన రజినీ.. పార్టీ పెట్టడానికి మాత్రం ధైర్యం చేయడం లేదు. తాజాగా అభిమానులతో సమావేశమైన ఆయన మళ్లీ.. పాత ముచ్చటనే ప్రస్తావించారు. చెన్నైలో రజినీ మక్కళ్ మండ్రం నిర్వాహకులతో సమావేశం తర్వాత ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. వీలైనంత త్వరగా తన రాజకీయ ప్రవేశంపై నిర్ణయం ప్రకటిస్తానని చెప్పిన ఆయన పార్టీ పెడతారా.. లేదా.. అనే అంశంపై చిక్కుముడి విప్పలేదు. అయితే.. కొంతమంది అభిమానులు మాత్రం ఇకపై పార్టీ పెడితేనే  రజినీతో కలిసి నడుస్తామని తేల్చి చెప్పారట. అయితే.. రజినీ వారిని బుజ్జగించే పనిలో ఉన్నారు. పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసి ఏ నిర్ణయం ప్రకటించకపోవడాన్ని గమనిస్తే రాజకీయ ప్రవేశంపై రజినీ వెనకడుగు వేస్తున్నారేమో అని కొందరు అభిప్రాయపడగా.. జనవరిలో కొత్త పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉందని కొందరంటున్నారు. కాగా.. నిరాశలో కొందరు రజినీ అభిమానులు మాత్రం దేవుడు శాసించేదెప్పుడో.. తలైవా పార్టీ పెట్టేదెప్పుడో అని నిట్టూరుస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

రిస్క్ చేయొద్దు..

భారత్‌ ఓపికకు పరీక్ష పెట్టి రిస్క్ చేయొద్దని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె శత్రు దేశాలను హెచ్చరించారు. నార్త్ బోర్డర్ లో జరుగుతున్న కుట్రను సమర్ధవంతంగా తిప్పికొట్టామని అన్నారు....

వాట్సాప్ వెబ్ వాడితే అంతే..

వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఇష్యూలో ఇంకా క్లారిటీ రాకముందే మరో కలకలం రేగింది. గూగుల్ సెర్చ్‌లో వాట్సాప్ వెబ్ యూజర్ల పర్సనల్ నంబర్లు కనపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇండిపెండెంట్ సైబర్...

టీకా ఎవరికి వద్దంటే…

ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ మొదలుకానుంది. అయితే వ్యాక్సిన్‌కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత...

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...