ఇండొనేషియాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోతవానలతో కొండచరియలు విరిగిపడి 14మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. జుటా పెర్మాయ్ లో జరిగిన ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారంటున్నారు అధికారులు. ఘటనా స్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు.