19.5 C
Hyderabad
Friday, November 27, 2020

ఇవాళ, రేపు గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన

దేశ ప్రధానమంత్రి నేడు, రేపు గుజరాత్‌ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పలు ప్రాంతాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందులో భాగంగా నిన్న అనారోగ్యంతో మృతిచెందిన మాజీ ముఖ్య‌మంత్రి కేశూభాయ్ ప‌టేల్ కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించ‌నున్నారు. న‌ర్మ‌ద జిల్లా కెవాడియాలో ప‌లు అభివృద్ధి కార్య‌క్రమాల్లో పాల్గొంటారు. అదేవిధంగా స‌ర్దార్ ప‌టేల్ జూలాజిక‌ల్ పార్కును, ఏక్‌తా మాల్‌ను ప్రారంభించ‌నున్నారు. 

స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా నిర్వ‌హించే ఏక్తా దివ‌స్ ప‌రేడ్‌‌లో పాల్గొంటారు. దేశ వ్యాప్తంగా ప్ర‌తి ఏడాది అక్టోబ‌ర్ 31న‌ ఏక్తా దివ‌స్‌ను జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా న‌ర్మ‌దా న‌దీ తీరంలోని ఐక్య‌తా విగ్ర‌హం వ‌ద్ద ప‌టేల్‌కు నివాళులు అర్పిస్తారు. అన్ని అధికారిక భాష‌ల్లో రూపొందించిన ఐక్య‌త విగ్ర‌హ నూత‌న వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తారు. అదేవిధంగా కెవాడియా-అహ్మ‌దాబాద్ మ‌ధ్య సీప్లేన్ సేవల‌ను జాతికి అంకితం చేస్తారు. 

- Advertisement -

Latest news

Related news

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....

నిఖార్సయిన హిందుత్వానికి నిర్వచనం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప హిందువు. సీఎం కేసీఆర్‌ చేసే యజ్ఞయాగాది క్రతువులు తాను ఎలాంటివారో చెప్పక్కనే చెబుతాయి. కేసీఆర్‌ చేపట్టిన ఏ పనిలోనైనా...