26.7 C
Hyderabad
Saturday, January 23, 2021

ఈ నెల 28న బీహార్‌ లో తొలిదశ ఎన్నికలు

ఈ నెల 28న జరగనున్న తొలి దశ ఎన్నికలకు సిద్ధమవుతుంది బీహార్‌.  ఫస్ట్‌ ఫేజ్‌ లో 71 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోరు జరగనుండగా.. బీజేపీ, ఆర్జేడీ, జేడీయూ పార్టీలు పలువురు ఉద్దండులను బరిలోకి దింపాయి. గయ నుంచి పోటీలోకి దిగిన బీజేపీ అభ్యర్థి ప్రేమ్ కుమార్ ఆరుసార్లు విజయం సాధించి, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నితీష్ కుమార్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. దినార్ నుంచి మరోమంత్రి జయకుమార్  సింగ్ ఎన్నికల బరిలోకి దిగారు. కహల్‌గావ్ నుంచి కాంగ్రెస్ తరపున దిగ్గజ నేత సందానంద్ సింగ్ కుమారుడు శుభానంద్ ముకేష్ పోటీ చేస్తున్నారు. మోకామా నుంచి బాహుబలి అనంత్ సింగ్ ఎపోటీ చేస్తున్నారు. ఇక లఖీసరాయ్ నుంచి మంత్రి విజయ్ కుమార్ సిన్హా బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. 

- Advertisement -

Latest news

Related news

స్థానిక యువతకు అవకాశం కల్పిస్తే ఇన్సెంటీవ్‌.. కేటీఆర్

టీఎస్‌ ఐ-పాస్‌ ద్వారా రాష్ట్రంలో పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతి మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఒకవేళ 15 రోజుల్లో అనుమతి ఇయ్యకుంటే ఇచ్చినట్టుగానే...

‘కిసాన్ పరేడ్’కు అనుమతిచ్చిన ఢిల్లీ పోలీసులు

కొత్త సాగు చట్టాలకు నిరసనగా జనవరి  26న ఢిల్లీ వీధుల్లో ట్రాక్టర్లతో ‘కిసాన్ గణతంత్ర పరేడ్’ నిర్వహించేందుకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. కిసాన్ పరేడ్ కు ఢిల్లీ పోలీసులు సూత్రపాయంగా...

నేతాజీ త్యాగాన్ని గుర్తుంచుకోవాలి.. ప్రధాని మోదీ

నేతాజీ సుభాశ్ చంద్రబోస్ స్ఫూర్తితోనే ఈ రోజు భారత్ ముందుకు వెళుతోందని, ఆయన చేసిన కృషి తరతరాల వారూ గుర్తుంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేతాజీ 125 వ...

ముత్తూట్ చోరీని ఛేదించిన సైబరాబాద్ పోలీసులు

తమిళనాడు హోసూరులోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు చేధించారు. ఈ చోరీకి పాల్ప‌డిన ఎనిమిది మంది స‌భ్యుల ముఠా‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి  25...