22.9 C
Hyderabad
Monday, September 21, 2020

ఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం, 9 మంది మృతి

ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రతాప్‌ గఢ్‌ జిల్లాలోని వాజిద్‌పూర్‌లో స్కార్పియో – ట్రక్కు ఢీకొనడంతో 9 మంది మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. వీరంతా హర్యానా నుంచి బీహార్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మృతులంతా స్కార్పియోలోనే ఇరుక్కుపోవడంతో వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కట్టర్ల సహాయంతో కత్తిరించి మృతదేహాలను బయటకు తీశారు. అలాగే ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Latest news

రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన దేవెగౌడ

మాజీ ప్రధానమంత్రి హెచ్‌ డీ దేవెగౌడ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. దేవెగౌడ చేత రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు. గత లోక్ సభ ఎన్నికల్లో దేవెగౌడ...

Related news

రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన దేవెగౌడ

మాజీ ప్రధానమంత్రి హెచ్‌ డీ దేవెగౌడ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. దేవెగౌడ చేత రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు. గత లోక్ సభ ఎన్నికల్లో దేవెగౌడ...

చిన్నశేష వాహనంపై ముర‌ళి కృష్ణుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజు ఉదయం శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో అర్చకులు ఏకాంతంగా  చిన్న శేష వాహన సేవను నిర్వహించారు. ఐదు శిరస్సుల నాగేంద్రుడిపై...

కేంద్ర వ్యవసాయ బిల్లులతో రైతులకు తీరని నష్టం: ఏంపీ కేశవరావు

రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా వ్యవసాయ బిల్లులను రూపొందించారని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు విమర్శించారు. వ్యవసాయ బిల్లులపై లోక్ సభలో మాట్లాడిన ఆయన, నూతన...

మిజోరంలో భూకంపం

ఈశాన్య రాష్ట్ర‌మైన మిజోరంలో భూకంపం సంభవించింది. రిక్ట‌ర్ స్కేలుపై దీని తీవ్ర‌త 4.6గా న‌మోద‌య్యింద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మోల‌జీ ప్ర‌క‌టించింది. చాంపైకి స‌మీపంలో ఆదివారం ఉద‌యం 7.29 గంట‌ల‌కు...