27.2 C
Hyderabad
Friday, December 4, 2020

ఉత్తర భారతాన్ని ముంచెత్తుతున్న భారీ వర్షాలు

ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కుండపోత వానలతో వరదలు ముంచెత్తుతున్నాయి. నదులు ప్రమాకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. పలు రాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి.  యూపీలోని 20జిల్లాలో 500పైగా గ్రామాలు వరదలతో అల్లాడుతున్నాయి. గంగా, రాప్టి, శారదా, గండక్‌ నదులు పొంగిపొర్లుతున్నాయి. మహారాష్ట్రలోని ముంబై, పాల్‌ఘర్‌, థానే, రాయ్‌గడ్‌, రత్నగిరి, సింధూదుర్గ్‌ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కర్నాటకలో 12జిల్లాలు, 885 గ్రామాలు కంభవృష్టిలో చిక్కుకున్నాయి. కేరళలోని అళప్పుజ, కొట్టా యం, ఎర్నాకుళం, ఇడుక్కి, వాయనాడ్‌, కోజికోడ్‌, కన్నూర్‌ జిల్లాల్లో ప్రకటించిన రెడ్‌ అలర్ట్‌ కొనసాగుతోంది. మరో వైపు భారీ వర్షాలు పడొచ్చనే అంచనాతో ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌, హరియాణాలు అప్రమత్తం అయ్యాయి. ఇటు చండీగఢ్‌, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, పశ్చిమబెంగాల్‌, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, మేఘాలయలను భారత వాతావరణ శాఖ అలర్ట్‌ చేసింది.

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....