బాలీవుడ్ డ్రగ్స్ కేసు పూటకో మలుపు తిరుగుతుంది. రియా ఇచ్చిన సమాచారంతో .. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిన్నటికి నిన్న టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ను విచారించింది. ఇవాళ మరో బ్యూటీ దీపికా పదుకోనేను ప్రశ్నించనున్నారు. నిన్న దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాశ్ నుంచి పలు విషయాలు రాబట్టిన ఎన్సీబీ అధికారులు.. వాట్సాప్ చాట్ ఫై ఫోకస్ చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో దీపిక ప్రమేయం ఉందంటున్న అధికారులు.. సారాను కూడా ఆరా తీయనున్నారు.