శబరిమల ఆలయం తెరుచుకుంది. ఏడునెలల తరువాత ఇవాళ్లి నుంచి భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నారు. అయ్యప్ప యాత్రకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది కేరళ ప్రభుత్వం. ఆలయంలోకి ప్రవేశించాలనుకునే భక్తులు దర్శనానికి 48 గంటల ముందు కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ తో పాటు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకురావాలని తెలిపారు అధికారులు. 10-60 సంవత్సరాల మధ్య వయస్కులకు మాత్రమే ఆలయ ప్రవేశం ఉంటుందని, రోజూ 250 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామన్నారు. ఇక పంబా నదిలో స్నానాలను నిలిపేశామన్న అధికారులు.. భక్తులు కొండ ఆలయ క్యాంపుల్లో రాత్రిపూట బస చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు