21.4 C
Hyderabad
Friday, October 23, 2020

కరోనాతో మొద‌టి మ‌హిళా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ మృతి

కరోనా వైరస్ మహారాష్ట్రలో కల్లోలం సృష్టిస్తోంది. మ‌హారాష్ట్ర లో పాజిటీవ్‌ కేసుల సంఖ్య 3లక్షలకు చేరువలో ఉంది. నిన్న ఒక్కరోజే ఏకంగా 7,975 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు.ఈ వైరస్‌ తో మాజీ ఐఏఎస్ అధికారిణి, మ‌హారాష్ట్ర మొద‌టి మ‌హిళా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నీలా స‌త్య‌నారా‌య‌ణ్  మ‌ర‌ణించారు. ముంబైలోని సెవన్  హిల్స్ ద‌వాఖాన‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు 72 ఏళ్ల నీలా. 1972 ఐఏఎస్ బ్యాచ్‌ కు చెందిన నీలా స‌త్య‌నారాయ‌ణ్ 2014, జూలై 5న రిటైర్ అయ్యారు. ప‌ద‌వీ విర‌మ‌ణకు ముందు మ‌హా‌రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు మొద‌టి మ‌హిళా క‌మిష‌న‌ర్‌గా 2009లో నియ‌మితుల‌య్యారు.

- Advertisement -

Latest news

Related news

రాజ‌శేఖ‌ర్ త్వ‌ర‌గా కోలుకోవాలి…చిరు ట్వీట్

క‌రోనాతో ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న రాజ‌శేఖ‌ర్‌కు సంబంధించి తాజాగా హెల్త్ బులిటెన్ విడుద‌లైంది.  రాజ‌శేఖ‌ర్  ఆరోగ్యం నిల‌క‌డ‌గానే  ఉంద‌ని, చికిత్స‌కు స్పందిస్తున్నార‌ని వైద్యులు తెలిపారు. అలానే త‌న తండ్రి...

సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా.. ఏడవరోజు మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సప్త ఆశ్వాలను కలిగిన సూర్యప్రభపై శ్రీనివాసుడు వజ్రకవచం ధరించి...

బీహార్‌ లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్‌

బీహార్ లో పోలింగ్‌ దగ్గర పడుతున్న వేళ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్‌ చేసింది. పాట్నాలో మేనిఫెస్టోను విడుదల చేసిన కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ..ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందించ‌డమే...

బ్రెజిల్‌ లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ వికటించి వలంటీర్‌ మృతి

కొవిడ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ వికటించి బ్రెజిల్‌ లో ఓ వలంటీరు మృతి చెందాడు. ఈ...