18.6 C
Hyderabad
Wednesday, October 28, 2020

కరోనా నియంత్ర‌ణ‌లో కేంద్రం విఫలం

మోదీ స‌ర్కార్‌పై మ‌రోసారి రాహుల్ గాంధీ విమ‌ర్శ‌లు చేశారు. కోవిడ్‌19ను నియంత్ర‌ణ‌ చేయడంలో కేంద్రం విఫలమైందని రాహుల్ ఆరోపించారు. నోట్ల ర‌ద్దు, జీఎస్టీ అమ‌లులో ఇప్పటికే విఫలమైందని విమర్శించారు. బీజేపీ సర్కార్ వైఫ‌ల్యాల‌పై భ‌విష్య‌త్తులో హార్వ‌ర్డ్ బిజినెస్ స్కూల్ అధ్య‌య‌నం చేయ‌నున్న‌ట్లు రాహుల్ వెల్ల‌డించారు. భ‌విష్య‌త్తులో ఇవే హెచ్‌బీఎస్ కేస్ స్ట‌డీలంటూ రాహుల్  ట్విట్ట‌ర్‌ లో ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు.  త‌న పోస్టుకు ఓ వీడియోను కూడా పోస్టు చేశారు.  ప్ర‌ధాని మోదీ జాతిని ఉద్దేశిస్తూ ప్ర‌సంగిస్తుంటే.. ఆ వీడియోలో వైర‌స్ కేసుల గ్రాఫ్ పెరుగుతూ పోతుంది.  

- Advertisement -

Latest news

Related news

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...

నాయిని సతీమణి మృతిప‌ట్ల మంత్రుల సంతాపం

మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిప‌ట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. అహ‌ల్య భౌతిక‌కాయానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.   నాయిని సతీమణి...

సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అరెస్ట్

సినీ నటి, బీజేపీ నేత కుష్బూను అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. వీసీకే అధినేత తిరుమావళవన్‎ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుండి చిదంబరంకు వెళ్తుండగా ముత్తుకాడులో...