27.2 C
Hyderabad
Friday, December 4, 2020

కరోనా బారినపడి డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ మృతి

తమిళనాడులో కరోనా రక్కసి ఓ ఎమ్మెల్యేను బలిగొంది. డీఎంకే ఎమ్మెల్యే అన్భళగన్…కరోనా కారణంగా మరణించారు. గత వారం తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు టెస్టులు చేయగా…కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన్ను చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్బళగన్…దివంగత మాజీ సీఎం కరుణానిధితో పాటూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు అత్యంత సన్నిహితుడు.  అంతేకాదు ఇవాళ అన్బళగన్ పుట్టిన రోజు  కూడా అవ్వడంతో. జన్మించిన రోజే మరణించడం బాధాకరం. ఒక శాసనసభ్యుడు కరోనా సోకి మరణించడం దేశంలో ఇదే ప్రథమం. అన్బళగన్‌ మృతి పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపారు.

- Advertisement -

Latest news

Related news

బొంతు శ్రీదేవి విజయం – కొనసాగుతున్న కారు హవా

గ్రేటర్ ఫలితాల్లో కారు టాప్ గేరులో దూసుకుపోతోంది. అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్‌ జోరు చూపిస్తోంది. ఇప్పటికే 29 చోట్ల విజయం సాధించిన గులాబీ...

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.