కర్ణాటకను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తర కర్ణాటకలో వరద బీభత్సం సృష్టించడంతో జనజీవనం స్థంభించింది. దీనికి తోడు మహారాష్ర్ట నుంచి వరద పోటెత్తడంతో 11 వేల ఇళ్లు దెబ్బతినగా 360 చెరువులు తెగాయి. 1,268 కల్వర్టులు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. లక్షలాది ఎకరాలలో పంటనష్టం వాటిల్లింది. సుమారు 15 జిల్లాల్లో బీభత్సం ప్రభావం చూపింది. బెళగావి జిల్లాలోని కృష్ణ, వేదగంగ, దూద్గంగ నదులకు 1.19 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండడంతో జిల్లావ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.