27 C
Hyderabad
Friday, December 4, 2020

కర్ణాటకలో దంచికొడుతున్న వర్షాలు

కర్ణాటకలో వర్షాలు దంచికొడుతున్నాయి.  ఓ నాలుగు రోజులు తగ్గినట్లే కనిపించినా, ఇప్పుడు మళ్లీ రాష్ట్రాన్ని నీట ముంచుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో. ప్రజలు బయటికి రావాలంటే భయపడుతున్నారు. బెంగళూరు, జప్పినమొగారు, కొట్టార చౌకి, ధార్వాడ్, బెళగావి, కొడగు, చిక్‌మంగళూరు తదితర ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పుత్తూరు, బంత్వాల్, సుళ్లియ, బెళ్తాంగడి, మూడిబిద్రి, కదాబా తదితర ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ఈ ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ ప్రారంభించారు. పలు ప్రాంతాల్లో కొండచెరియలు విరిగిపడ్డాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. పంటలు, తోటలు నాశనమైపోయాయి. డ్రైనేజీలు నిండిపోవడంతో రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరింది. ఇళ్లలోకి కూడా ఈ నీరు చేరడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. ఈ వరదల కారణంగా రాష్ట్రానికి కనీసం 80వేల కోట్ల నష్టం జరిగి ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు. మరోవైపు రానున్న 48గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. తీరప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో యడ్యూరప్ప సర్కార్‌ అప్రమత్తం అయింది.

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....