కులాంతర, మతాంతర వివాహాల పథకాన్ని రద్దు చేస్తూ.. అందుకు ప్రోత్సాహకంగా ఇచ్చే.. నగదు బహుమతిని రద్దు చేసే ఆలోచనలో యూపీ సీఎం యోగి సమాలోచనలు చేస్తున్నారు. 44 ఏండ్ల కిందట ప్రవేశపెట్టిన ఈ పథకానికి యోగి సర్కార్ స్వస్తి పలికేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

లవ్ జిహాద్ పేరుతో జరుగుతున్న మతమార్పుడులను అడ్డుకునేందుకు యూపీ సర్కార్ ఈ కొత్త చట్టాన్ని తెస్తోంది. కానీ భిన్న విశ్వాసాల ప్రజల మధ్య జరిగే వివాహ ప్రక్రియలను ప్రోత్సహించేందుకు 1976లో ప్రవేశపెట్టిన పథకాన్ని యూపీ సర్కార్ రద్దు చేయాలని భావిస్తోంది. యూపీ నుంచి విడిపోయి.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఉత్తరాఖండ్ కూడా ఈ పథకాన్ని రద్దు చేయాలని భావిస్తున్నది. ఈ స్కీమ్ కింద.. మతాంతర వివాహం చేసుకున్న వారు.. లగ్గం జరిగిన రెండేండ్ల లోపు జిల్లా మెజిస్ట్రేట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు ఆమోదం పొందిన దంపతులకు రూ. 50వేల నగదు ప్రోత్సాహకంగా ఇస్తారు. గత ఏడాది ఈ స్కీమ్ కింద 11 జంటలు లబ్ధిపొందాయి. కానీ ఈ ఏడాది ఒక్కరికి కూడా నగదు విడుదల చేయలేదు. ఈ పథకం దరఖాస్తు చేసుకున్న స్కీమ్ కోసం నాలుగు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మతమార్పిడిలకు పాల్పడేవారికి పదేళ్లు కఠిన శిక్ష అమలు చేయనున్నట్లు ఇటీవల యోగి సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆ ఆర్డినెన్స్‌కు గవర్నర్ క్లియరెన్స్ కూడా ఇచ్చింది.