23.2 C
Hyderabad
Tuesday, October 20, 2020

కృష్ణా, గోదావ‌రి ప‌ర‌వ‌ళ్లు… నిండుకుండ‌ల్లా ప్రాజెక్టులు

కృష్ణా, గోదావరి.. బేసిన్ల పరిధిలోని అన్ని నదుల్లోనూ వరద ఉధృతి కొనసాగుతున్నది. కుందూ, పెన్నా బేసిన్లలో భారీగా వరద వస్తుండటంతో ఆంధ్రప్రదేశ్‌ పోతిరెడ్డిపాడు ద్వారా నీటి విడుదలను పెద్ద ఎత్తున కుదించుకున్నది. గత కొన్నిరోజులుగా కేవలం 1,500 నుంచి 2,000 క్యూసెక్కుల స్థాయిలోనే నీటి విడుదల కొనసాగుతున్నది. పెన్నా బేసిన్‌కూ ఈ సారి భారీ వరదలు రావడంతో ఆ బేసిన్‌ పరిధిలోని ఏపీ రిజర్వాయర్లన్నీ నిండుకుండలా మారాయి. దీంతో కృష్ణాజలాల అవసరం లేకపోవడంతో ఏపీ అధికారులు శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు డిశ్చార్జిని పూర్తిగా తగ్గించారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు పోతిరెడ్డిపాడు ద్వారా సుమారు 90 టీఎంసీల నీటిని మళ్లించారు. వాస్తవంగా పెన్నా బేసిన్‌కు వరదలు రానట్లయితే ఇప్పటికే నీటి మళ్లింపు వంద టీఎంసీలు దాటి ఇంకా పరుగులు తీసేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండాపోయింది. కాగా కృష్ణా బేసిన్‌లోని ఎగువన ఆల్మట్టి మొదలు దిగువన పులిచింతల వరకు లక్షల క్యూసెక్కుల్లో జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి.

జూరాలకు రెండు లక్షల క్యూసెక్కులకు మించి వరద వస్తున్నది. తుంగభద్ర నుంచి 90 వేల క్యూసెక్కుల పైచిలుకు వరద శ్రీశైలానికి పరుగులు తీస్తున్నది. శ్రీశైలం వద్ద ఇన్‌ఫ్లో మూడు లక్షల క్యూసెక్కులు దాటగా.. అవుట్‌ఫ్లో కూడా దాదాపు అంతేమేర నమోదవుతున్నది. నాగార్జునసాగర్‌కు 2.82 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో అంతేమేర దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పులిచింతల మీదుగా 2.80 లక్షల క్యూసెక్కుల కృష్ణాజలాలు ప్రకాశం బరాజ్‌ను దాటి సముద్రంలో కలుస్తున్నాయి. మరోవైపు గోదావరిలోనూ వరద ఉధృతి తగ్గలేదు. శ్రీరాంసాగర్‌కు 1.44 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అంతేమేర వరదను దిగువకు వదులుతున్నారు. ఈ క్రమంలో ఎల్లంపల్లి వద్ద ఇన్‌ఫ్లో ఏకంగా రెండు లక్షల క్యూసెక్కులు దాటింది.  సింగూరు ప్రాజెక్టుకు 15 వేల ఃక్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరింది. 

- Advertisement -

Latest news

Related news

నాలుగో రోజు వరద ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా నాలుగో రోజు పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్. రాజేంద్రనగర్ లో పర్యటించిన మంత్రి వరదల్లో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ఐదు లక్షల రూపాలయ ఎక్స్ గ్రేషియా...

ఓఆర్ఆర్ పై ట్రామా కేంద్రాలు, అంబులెన్స్ లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఓఆర్ఆర్ పై 10 ట్రామా కేంద్రాలు, 10 అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ లను మంత్రి కేటీఆర్ ప్రాంరంభించారు. దీంతో ఓఆర్ఆర్ పై  పూర్తి స్ధాయి...

భారత్‌లో 74 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. అక్టోబరు తొలి 15 రోజుల్లో కరోనా కొత్త కేసులలో 18%, మరణాల్లో 19% తగ్గుదల కనిపించింది. నిన్నటికి నిన్న 62వేల  212కొత్త...

ఏడు నెలల తరువాత తెరుచుకున్న శబరిమల

శబరిమల ఆలయం తెరుచుకుంది. ఏడునెలల తరువాత ఇవాళ్లి నుంచి భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నారు.  అయ్యప్ప యాత్రకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది కేరళ ప్రభుత్వం. ఆలయంలోకి ప్రవేశించాలనుకునే...