కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి హర్ సిమ్రత్ కౌర్ రాజీనామాను ఆమోదించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఆ మంత్రిత్వశాఖ బాధ్యతలను మరో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు అప్పగించారు. వ్యవసాయ మార్కెట్లను సరళీకృతం చేయాలని కోరుతూ తీసుకువచ్చిన చట్టాన్ని నిరసిస్తూ హర్సిమ్రత్ కౌర్ బాదల్ రిజైన్ చేశారు. రైతు వ్యతిరేక ఆర్డినెన్స్‌లు, చట్టాలకు నిరసనగా రాజీనామా చేస్తూ ప్రధాని కార్యాలయంలో లేఖను అందించారు. రైతులకు, వ్యవసాయానికి సంబంధించిన బిల్లుల విషయంలో ప్రభుత్వ నిర్ణయంతో శిరోమణి అకాళీదళ్ విభేదించింది. అయితే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినా ఎన్డీయేలోనే కొనసాగనున్నట్లు సమాచారం.