28.2 C
Hyderabad
Sunday, January 17, 2021

కేంద్ర ప్రభుత్వం భోజనాన్ని తిరస్కరించిన రైతులు

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను గురువారం కేంద్ర ప్రభుత్వం రెండో విడత చర్చలకు పిలిచింది. ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో కేంద్రమంత్రులు పీయూష్‌ గోయల్‌, నరేంద్ర సింగ్‌ తోమర్ లు  40 రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. 

అయితే భోజన స‌మ‌యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన భోజనాన్ని రైతులు తిరస్కరించారు. సర్కారు అందించే భోజ‌నం, ఛాయ్‌ల‌ను మాకు అవసరం లేదని.. తాము ఇంటి నుంచి భోజ‌నం తెచ్చుకున్నామ‌ని రైతు సంఘాల నేత‌లు తెలిపారు.

డిసెంబర్ 1న జరిగిన సమావేశంలో రైతుల అనుమానాలు, సందేహాల నివృత్తి కోసం కమిటీని నియమిస్తామని మంత్రులు ప్రకటించారు. రైతులు ఆ ప్రతిపాదనను కూడా తిరస్కరించారు. ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రైతులు మాత్రం చట్టాలను వెనక్కి తీసుకోవడం తప్ప వేరే ఏం చెప్పినా ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. మరో వైపు రైతుల ఆందోళనకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. 

- Advertisement -

Latest news

Related news

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...

మారిన కరోనా కాలర్ ట్యూన్

ఎవరికైనా కాల్ చేయగానే దగ్గు సౌండ్ వినిపించి కరోనా వైరస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే.. అంటూ ఒక కాలర్ వాయిస్ వినిపించేది. అయితే ఇప్పుడా ట్యూన్ మారిపోయింది. ఇప్పుడేం...

సరికొత్త అప్‌డేట్స్‌తో పబ్జీ ఇండియా

పబ్జీ గేమ్ బ్యాన్‌తో చాలామంది యూత్ అప్‌సెట్ అయ్యారు. పబ్జీ ఇండియన్ వెర్షన్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే పబ్జీ లవర్స్ కోసం టెన్సెంట్ గేమ్స్ కంపెనీ ఓ...

తాళిబొట్టు తీసుకొచ్చిన డ్రోన్.. వీడియో వైరల్..

మామూలుగా పెళ్లిళ్లలో గాలిలో డ్రోన్ తిరుగుతూ వేడుకలన్నీ పై నుంచి షూట్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే అదే డ్రోన్ మంగళసూత్రాన్ని తీసుకొచ్చి వరుడి చేతికందిస్తే.. ఆ విజ్యువల్...